Skip to main content

Namaste NRI

సునితా విలియమ్స్ రోదసియాత్ర.. మూడోసారి వెళ్లిన మహిళగా రికార్డు

భారతీయ మూలాలు కలిగిన వ్యోమగామి సునీత విలియమ్స్‌ మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లారు. బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌక ద్వారా 25 గంటలు ప్రయాణించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. సునీత(58)తో పాటు బచ్‌ విల్‌మోర్‌(61) కూడా ఈ యాత్రలో ఉన్నారు. బుధవారం ఫ్లోరిడాలోని కేప్‌ కెనావెరాల్‌ స్పేస్‌ ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి ఈ వ్యోమనౌకను ప్రయోగించారు. వారం పాటు వీరిద్దరూ అంతరిక్షంలో ఉండి తిరిగి రానున్నారు.

 2006, 2012లో అంతరిక్షంలోకి వెళ్లివచ్చారు సునితా విలియమ్స్. రెండు మిషన్లలో 322 అంతరిక్షంలో గడిపారు. ఇప్పటి వరకు ఇదే రికార్డు. సునిత 14 జూలై 2012న తన రెండోసారి అంతరిక్షయానం చేశారు. నాలుగు నెలలపాటు అంతరిక్షంలోనే గడిపి, 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేసి సరికొత్త రికార్డు సృష్టించారు.

Social Share Spread Message

Latest News