Skip to main content

Namaste NRI

గుమ్మ‌డికాయ కొట్టిన దేవకీ నందన వాసుదేవ

అశోక్‌ గల్లా కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం దేవకీ నందన వాసుదేవ. అర్జున్‌ జంధ్యాల దర్శకుడు. ప్రశాంత్‌వర్మ కథనందించాడు. సోమినేని బాలకృష్ణ నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో ప్రీరిలీజ్‌ వేడుకను నిర్వహించబోతున్నారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఆధ్యాత్మిక అంశాలు కలబోసిన కుటుంబ కథా చిత్రమిది. హృద్యమైన ప్రేమకథతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటుంది. భీమ్స్‌ సిసిరోలియో అద్భుతమైన పాటలను అందించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నది అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్‌ మూరెళ్ల, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, సంభాషణలు: సాయిమాధవ్‌ బుర్రా, దర్శకత్వం: అర్జున్‌ జంధ్యాల.

Social Share Spread Message

Latest News