Skip to main content

Namaste NRI

చంద్రబాబు విజయంతో పోలాండ్‌లో… సంబరాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో పోలాండ్‌లోని చంద్రబాబు ఫాలోవర్లు, టీడీపీ కార్యకర్తలు  పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తలైన కాట్రగడ్డ చందు, విజయ్, ఐటీ నిపుణులైన రామ సతీష్ ఆధ్వర్యంలో సంబరాలు అంబరాన్నంటా యి. వీరంతా కలిసి చంద్రబాబు విజయాన్ని బాణసంచా వెలిగించి, స్వీట్స్ పంచుకుని ఘనంగా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. కాట్రగడ్డ చందు, విజయ్  200 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కలిపించి, మరెంతో మంది తెలుగు వారికి పోలాండ్‌లో సహాయ సహకారాలు అందిస్తున్నారు. రామ సతీష్ వంటి వారు పోలాండ్‌లో మన తెలుగు వారి కోసం అండగా నిలిచి, తెలుగు దేశం పార్టీ కోసం కొంత కాలంగా చురుకుగా పని చేస్తున్నారు.

ఈ విజయోత్సవ కార్యక్రమంలో ఐటీ నిపుణులు రామ్మోహన్, కిరణ్, సచిన్, ప్రవీణ్, పవన్, సందీప్, రామ నాయుడు, సురేష్, మోహన్, మహేష్, వినయ్, మౌర్య , శైలేంద్ర, నీల, విశాల్, మల్లి, కిరణ్, ఆజాద్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News