Skip to main content

Namaste NRI

విజయవంతంగా ముగిసిన.. జీ7 శిఖరాగ్ర సదస్సు

ఏడు దేశాల జీ7 శిఖరాగ్ర సదస్సు విజయవంతంగా ముగిసినట్టు సదస్సుకు ఆతిథ్యమిచ్చిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ప్రకటించారు. ద్వైపాక్షిక సంబంధాలు పెంపు, వ్యూహాత్మక భాగస్వామ్యం వంటి అంశాలపై వివిధ దేశాల ప్రతినిధులతో విస్తృతంగా చర్చలు జరిగినట్టు వివరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులకు ఇండో-పసిఫిక్‌ ప్రాంతం పట్ల ఉన్న నిబద్ధత చైనాకు స్పష్టమైన సంకేతంగా ఆమె అభివర్ణించారు. తాము ఏ విషయంలోనైనా బహిరంగ చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు ఆమె ప్రకటించారు. అందులో భాగంగానే భారత్‌తో ఆమె చర్చలు జరిపారు.

Social Share Spread Message

Latest News