Skip to main content

Namaste NRI

అజిత్ ధోవల్‌తో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు భేటీ

జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌తో (ఎన్‌ఎస్‌ఏ) అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలివన్‌ ఢిల్లీలో సమావేశమయ్యారు. పరస్పర ప్రయోజనాలతో ముడిపడిన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై భారత్‌-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి ఇరువురు చర్చించారు. ఇరు దేశాలకు చెందిన వివిధ విభాగాల ప్రతినిధి బృందాలతోనూ ఎన్‌ఎస్‌ఏలు చర్చించనున్నారు.

ఇక సీఐఐ ఆధ్వర్యంలో జరిగే ఇండియా-యూఎస్‌ ఐసీఈటీ రౌండ్‌టేబుల్‌ భేటీలోనూ వీరు పాల్గొననున్నారు. ఈ సమావేశానికి పరిశ్రమ ప్రముఖులు, వ్యాపార దిగ్గజాలు, సీఈవోలు హాజరు కానున్నారు.

Social Share Spread Message

Latest News