Skip to main content

Namaste NRI

22 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 22న ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 12 వరకు జరిగే ఈ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ నెల 23న పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారని మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. బడ్జెట్‌ సమావేశాల కోసం ఉభయ సభలను సమావేశపరిచే ప్రతిపాదనను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. మోదీ 3.0 ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్‌ ఇది. కాగా, లోక్‌సభ ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

Social Share Spread Message

Latest News