Skip to main content

Namaste NRI

ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత పురస్కారం

రష్యా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి విశిష్ట గౌరవం దక్కింది. ఆ దేశ అత్యున్నత పురస్కారం ది ఆర్డర్‌ ఆఫ్‌ సెంయిట్‌ ఆండ్రూ ది అపోస్టల్‌ ను ప్రకటించింది. ఈ అవార్డును ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రధాని మోదీకి ప్రదానం చేశారు. రష్యా-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల విస్తరణతో పాటు బలోపేతానికి మోదీ చేసిన కృషికి గుర్తింపుగా అత్యున్నత పురస్కారంతో గౌరవించినట్లు తెలిపారు.

అయితే, రష్యా పురస్కారం ప్రకటించడంపై ప్రధాని మోదీ స్పందించారు. రష్యా ప్రభుత్వం ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ పురస్కారం అందించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానన్నారు. ఈ సందర్భంగా రష్యా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. అవార్డు 140 కోట్ల మంది భారతీయులకు అంకితమిస్తున్నట్లు పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News