Skip to main content

Namaste NRI

మంచు లక్ష్మి నటించిన ఆదిపర్వం సాంగ్ లాంఛ్

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆదిపర్వం. శివ కంఠంనేని, ఆదిత్య ఓం, ఏస్తర్‌ నోరోనా తదితరులు ఇతర ప్రధాన పాత్రల్ని పోషించారు. పీరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి సంజీవ్‌ మోగోటి దర్శకత్వం వహించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలోని ఓ పాటను విడుదల చేశారు. ఈ సినిమాలో మంచు లక్ష్మి నాగులాపురం నాగమ్మగా శక్తివంతమైన పాత్రలో కనిపిస్తుందని, ఆమె చేసిన యాక్షన్‌ సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయని, పీరియాడిక్‌ డ్రామాగా ప్రేక్షకులను మెప్పిస్తుందని దర్శకుడు తెలిపారు.

పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయబోతున్నామని నిర్మాత ఎమ్‌.ఎస్‌.కె తెలిపారు. అద్భుత మైన సోషియో ఫాంటసీ కథాంశమిదని, తన పాత్ర భిన్న పార్శాల్లో సాగుతుందని, యాక్షన్‌ సీన్స్‌ కోసం చాలా కష్టపడ్డానని మంచు లక్ష్మి పేర్కొంది. ఈ కార్యక్రమంలో చిత్ర తారగణం అందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News