Skip to main content

Namaste NRI

మిస్టర్ బచ్చన్ నుండి కొత్త సాంగ్

రవితేజ కథానాయకుడిగా హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం మిస్టర్‌ బచ్చన్‌. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక.   పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. జగపతిబాబు, సచిన్‌ ఖేడేకర్‌ తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమాలోని తొలి గీతాన్ని విడుదల చేశారు. మిక్కీ జే మేయర్‌ స్వరపరచిన ఈ పాటను సాహితీ రచించారు. చిట్టిగువ్వ పిట్టలాంటి చక్కనమ్మా..బొట్టు పెట్టి పట్టుచీర కట్టుకోమ్మ జట్టుకట్టి చుట్టమల్లె చుట్టుకోమ్మా అంటూ చక్కటి భావాలతో ఈ పాట సాగింది. కశ్మీర్‌ నేపథ్యంలో చిత్రీకరించిన విజువల్స్‌ ఆకట్టుకున్నాయి. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తనదైన శైలి వినోదంతో దర్శకుడు హరీష్‌శంకర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆయనంక బోస్‌, రచన-దర్శకత్వం: హరీష్‌ శంకర్‌.

Social Share Spread Message

Latest News