Skip to main content

Namaste NRI

శశి మధనం సూపర్ సక్సెస్ .. సక్సెస్ మీట్ లో టీమ్

సోనియాసింగ్‌, పవన్‌ సిద్ధు జంటగా నటించిన వెబ్‌సిరీస్‌ శశి మధనం. వినోద్‌ గాలి దర్శకుడు. హరీశ్‌ కోహిర్క ర్‌ నిర్మాత. ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌ అయిన ఈ సిరీస్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్నదని మేక ర్స్‌ ఆనందం వెలిబుచ్చారు. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్‌ లో  గ్రాండ్ గా సక్సెస్ మీట్ ని నిర్వహించింది. సక్సెస్ మీట్ లో హీరోయిన్ సోనియా సింగ్ మాట్లాడుతూ ప్రేక్షకులు సబ్‌ స్క్రిప్షన్‌ తీసుకొని మరీ ఈ సిరీస్‌ చూడటం ఆనందంగా ఉంది.అద్భుతమైన స్క్రిప్ట్‌తో ఈ సిరీస్‌ రూపొందింది అని అన్నారు.

సోనియా వుంది కాబట్టే తాను ఫ్రీగా ఎఫర్ట్స్‌ పెట్టగలిగానని, ఈ సిరీస్‌ విజయవంతం కావడం ఆనందంగా ఉందని పవన్‌సిద్ధు ఆనందం వెలిబుచ్చారు. అందరి ప్రోత్సాహం వల్లే ఈ సిరీస్‌ బాగా వచ్చిందని దర్శకుడు అన్నారు. నిర్మాత హరీష్ కోహిర్కర్ మాట్లాడుతూ శశి మధనం ఫ్యామిలీ అంతా కూర్చుని చూసే ఎంటర్ టైనర్. ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ విన్ వారికి థాంక్స్. చాలా అద్భుతమైన టీంతో కలసి చాలా మంచి ఎంటర్ టైనర్ ని ఇచ్చాం. ఈ రోజు సక్సెస్ సెలబ్రేషన్ జరుపుకోవడం ఆనందంగా వుంది. ఈ సిరిస్ కి పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. సోనియా, పవన్ చాలా సపోర్ట్ చేశారు. టీం అందరికీ సపోర్ట్ వలన ఈ ప్రాజెక్ట్ ఇంత అద్భుత విజయం సాధించింది అన్నారు. టీం అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

Social Share Spread Message

Latest News