Skip to main content

Namaste NRI

స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా మిస్టర్‌ బచ్చన్‌

మాస్ మ‌హరాజా రవితేజ, దర్శకుడు హరీశ్‌ శంకర్‌ కాంబోలో వస్తున్న తాజా చిత్రం మిస్టర్‌ బచ్చన్‌. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక.  హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్‌ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. వైట్‌ సూట్‌లో  స్టైలిష్ గా ఉన్న రవితేజను ఈ పోస్టర్‌లో చూడొ చ్చు. ఇప్పటివరకూ విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తున్నదని, సుబ్ర మణ్యం ఫర్‌ సేల్‌, గద్దలకొండ గణేష్‌ సినిమాల తర్వాత హరీశ్‌శంకర్‌, మిక్కీ జె.మేయర్‌ కలిసి పనిచేస్తున్న సినిమా ఇదేనని, అందుకు తగ్గట్టే పాటలు చార్ట్‌ బస్టర్‌ హిట్స్‌గా నిలిచాయని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు, సచిన్‌ ఖేడేకర్‌ కీలక పాత్రధారులు. ఈచిత్రానికి కెమెరా: అయాంక బోస్‌, సమర్పణ: పనోరమా స్టూడియోస్‌ అండ్‌ టీ సిరీస్‌, సహనిర్మాత: వివేక్‌ కూచిభొట్ల.

Social Share Spread Message

Latest News