మాస్ మహరాజా రవితేజ, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. హరీశ్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. వైట్ సూట్‌లో స్టైలిష్ గా ఉన్న రవితేజను ఈ పోస్టర్‌లో చూడొ చ్చు. ఇప్పటివరకూ విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తున్నదని, సుబ్ర మణ్యం ఫర్ సేల్, గద్దలకొండ గణేష్ సినిమాల తర్వాత హరీశ్‌శంకర్, మిక్కీ జె.మేయర్ కలిసి పనిచేస్తున్న సినిమా ఇదేనని, అందుకు తగ్గట్టే పాటలు చార్ట్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రధారులు. ఈచిత్రానికి కెమెరా: అయాంక బోస్, సమర్పణ: పనోరమా స్టూడియోస్ అండ్ టీ సిరీస్, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల.