బ్రెజిల్‌లోని రియో డీ జనీరో సరిహద్దు నీటి వనరుల్లోని షార్క్ చేపల్లో కొకైన్ గుర్తించటం సంచలనం రేపింది. దీని ప్రభావంతో వాటి వ్యవహారశైలిలో మార్పులు వస్తున్నాయని, విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు. వాటి కండరాల్లో సాధారణ మోతాదు కన్నా 100 రెట్లు అధికంగా కొకైన్ ఆనవాళ్లు ఉన్నట్టు గుర్తించా రు. అయితే, వీటికి కొకైన్ ఎక్కడి నుంచి వస్తున్నదో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
అక్రమంగా డ్రగ్స్ తయారుచేస్తున్న ల్యాబ్‌ల నుంచి నీటిని నీటి వనరుల్లోకి వదలటం వల్ల, ఆ నీటిని తాగటం తో షార్క్‌ల శరీరంలో కొకైన్ చేరుతున్నదన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే షార్క్‌లలో కొకైన్ స్థాయి లు అత్యధికంగా ఉన్నాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే, వాటి కంటి చూపు మందగించి, వేటాడే శక్తిని కోల్పోతా యని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు.