Skip to main content

Namaste NRI

శ్రీదేవి బర్త్ డే.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్

అందాల తార శ్రీదేవి తనయ, బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ కు దైవభక్తి ఎక్కువే. ప్రత్యేక సందర్భాలు, ఖాళీ సమయం ఉన్నప్పుడల్లా తిరుమల లో వాలిపోతుంటుంది.స్నేహితులు, బంధువులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్తుంటుంది. తన తల్లి శ్రీదేవి 61వ జయంతి సందర్భంగా జాన్వీ వెంక న్న దర్శనానికి వెళ్లింది. సంప్రదాయ చీరకట్టులో స్నేహితుడు శిఖర్‌ పహారియా తో కలిసి వీఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న జాన్వీకి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Social Share Spread Message

Latest News