Skip to main content

Namaste NRI

జూలై 24న విడుదలకు సిద్ధమైన కాగితం పడవలు

వర్ధన్‌, కృష్ణప్రియ జంటగా నటిస్తున్న ప్రేమకథాచిత్రం కాగితం పడవలు. ఎంజీఆర్‌ తుకారం దర్శకుడు. కీర్తన నరేశ్‌, టీఆర్‌ ప్రసాద్‌రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప నిర్మాతలు. ఇప్పటికే ప్రచార చిత్రాలకు మంచి స్పందన వస్తున్నదని మేకర్స్‌ ఆనందం వెలిబుచ్చారు. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని మేకర్స్‌ ప్రకటించారు. ఈ నెల 24న ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ద్వారా సినిమా విడుదల కానున్నది. అందర్నీ అలరించే హృద్యమైన ప్రేమకథాచిత్రమిదని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: రుద్రసాయి, సంగీతం: ఏఐఎస్‌ నౌఫల్‌ రాజా, నిర్మాణం: ఎస్‌ఎల్‌ఎన్‌ సినీ క్రియేషన్స్‌, ప్రణది క్రియేషన్స్‌, నవ నారాయణ సినీ క్రియేషన్స్‌.

Social Share Spread Message

Latest News