Skip to main content

Namaste NRI

జర్మనీలో కఠిన నిబంధనలు

ఐరోపా అతి పెద్ద ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం కల్పించే లక్ష్యంతో జర్మనీ ప్రభుత్వం సమగ్ర సంస్కరణల ప్యాకేజీని ఆవిష్కరించింది. అయితే ఈ ప్యాకేజీలోని ఒక ప్రతిపాదనపైన ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతున్నది. అదే సిక్‌ లీవ్‌ నిబంధనలు కఠినతరం చేయడం. ఇకపై ఉద్యోగులు సిక్‌ లీవ్‌ పెడితే దానికి సంబంధించిన వైద్య ధ్రువీకరణ పత్రం సెలవు పెట్టిన మొదటి రోజే సమర్పించాలి. అంతకుముందు ఉద్యోగులు ఎలాంటి డాక్టర్‌ సర్టిఫికెట్‌ సమర్పించాల్సిన అవసరం లేకుండా మూడు రోజులు సిక్‌ లీవ్‌ను వినియోగించుకునే వారు. ఉత్పాదకతను పెంచడానికి, అభివృద్ధికి అవరోధంగా మారుతున్న దీర్ఘకాలిక ఆర్థిక సవాళ్లను పరిష్కరించడానికి జర్మనీ ప్రభుత్వం విస్తృతంగా సంస్కరణలు చేపడుతున్నది.

Social Share Spread Message

Latest News