Skip to main content

Namaste NRI

బర్త్‌ టూరిజంపై ట్రంప్‌ సర్కార్‌ కన్ను

జన్మతః పౌరసత్వం కేసులో అమెరికా సుప్రీంకోర్టు నుండి గట్టి ఎదురుదెబ్బ తగిలిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం బర్త్‌ టూరిజం(జనన పర్యాటకం)గా పిలిచే దీర్ఘకాలిక సమస్యను ఎదుర్కొనడానికి ఒక కొత్త మార్గాన్ని అన్వేషిస్తున్నది. గర్భంతో ఉన్న విదేశీ మహిళలు అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధించడం వంటి కొత్త ప్రణాళికపై ట్రంప్‌కు చెందిన మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌(మాగా) మిత్రులు దృష్టి పెట్టినట్లు తెలిసింది.

బర్త్‌ టూరిజంకు ఏర్పాటు చేయడంలో సాయపడే సంస్థలు, వ్యక్తులపై చట్టపరమైన చర్యలు చేపట్టడం, తమ సందర్శన ఉద్దేశాన్ని దాచిపెట్టి అమెరికాలోకి ప్రవేశించే మహిళలపై మోసానికి పాల్పడినట్లు అభియోగాలు నమోదు చేయడం, అంతేగాక గర్భంతో ఉన్న విదేశీ మహిళలను దేశంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం సహా పలు ప్రత్యామ్నాయాలను అధికారులు పరిశీలిస్తున్నారు. జన్మతః లభించే అమెరికన్‌ పౌరసత్వ విలువను పరిరక్షించడానికి అధ్యక్షుడు ట్రంప్‌నకు పూర్తిగా కట్టుబడి ఉన్నారని, అందుకే నిన్నటి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దీనిపై తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కాంగ్రెస్‌ను ఆదేశించారని వైట్‌ హౌస్‌ ప్రతినిధి అబిగైల్‌ జాక్సన్‌ ఆక్సియోస్‌కు తెలిపారు. జనన పర్యాటక పథకాలపై దర్యాప్తులకు న్యాయ శాఖ కూడా ప్రాధాన్యత ఇస్తుందని ఆమె చెప్పారు.

Social Share Spread Message

Latest News