Skip to main content

Namaste NRI

25 ఏళ్ల క్రితం చనిపోయిన వారు తిరిగొస్తే?

రిషి, ప్రియాంక కుమార్‌ జంటగా రూపొందిన చిత్రం రుద్ర గరుడ పురాణం. కేఎస్‌ సందీప్‌ దర్శకుడు. అశ్విన్‌ విజయ్‌, లోహిత్‌ నిర్మాతలు. నిర్మాత, దర్శకుడు మధుర శ్రీధర్‌ టీజర్‌ను లాంచ్‌ చేశారు. హీరో రిషి మాట్లాడు తూ గరుడ పురాణంలోని అంశాలు ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. 25 ఏళ్ల క్రితం ఓ బస్సు ప్రమాదం లో చనిపోయిన వారంతా తిరిగి వస్తే ఏం జరిగిందన్నదే చిత్ర కథ. సీట్‌ఎడ్జ్‌ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటుంది అన్నారు. హీరో రిషి అద్భుతమైన నటుడని, ఆయన నటించిన కన్నడ సినిమాలు కొన్ని చూశానని మధుర శ్రీధర్‌ పేర్కొన్నారు. నాలుగు దక్షిణాది భాషల్లో విడుదల కానుంది.  ఈ చిత్రానికి సంగీతం: కృష్ణప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కేఎస్‌ సందీప్‌.

Social Share Spread Message

Latest News