Skip to main content

Namaste NRI

బర్త్‌ డే స్పెషల్‌.. శర్వా37లో సంయుక్తా మీనన్‌ పాత్ర ఇదే

టాలీవుడ్ యువ హీరో శర్వానంద్‌  బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాల్లో ఒకటి శర్వా 37.  రామ్‌ అబ్బరాజు దర్శకత్వం.  ఈ మూవీలో సంయుక్తా మీనన్‌ ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది. సంయుక్తా మీనన్‌ బర్త్‌ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫస్ట్ లుక్‌ పోస్టర్ షేర్ చేశారు మేకర్స్‌.ఇందులో దియా పాత్రలో నటిస్తున్నట్టు చెబుతూ, సంప్రదాయ నృత్య భంగిమలో ఉన్న స్టిల్‌ను అందరితో పంచుకున్నారు మేకర్స్. ఈ లుక్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. అద్భుతమైన ఫన్‌ రైడ్‌తో ప్రేమ, నవ్వుల కలయికను ఇదివరకెన్నడూ లేని విధంగా సెలబ్రేట్‌ చేసుకునేందుకు రెడీగా ఉంది. ఈ మూవీలో ఏజెంట్‌ ఫేం సాక్షి వైద్య మరో ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా,  ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్ సుంకర తెరకెక్కిస్తున్నారు.

Social Share Spread Message

Latest News