Skip to main content

Namaste NRI

శ్రీలంక ప్రధాని పీఠంపై ఆమె.. నూతన ప్రధాని గా హరిణి అమరసూర్య ప్రమాణ స్వీకారం 

శ్రీలంక ప్రధానిగా హరిణి అమరసూర్య నియమితులయ్యారు. మంగళవారం ఆమె నూతన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. సిరిమావో బండారు నాయకే (1994-2000) తర్వాత శ్రీలంకలో ప్రధాని పదవి చేపట్టిన మరో మహిళ హరిణి. 54 ఏళ్ల హరిణి అమరసూర్యతో ఆ దేశాధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే మరో ఇద్దరు నేతలను క్యాబినెట్‌ మంత్రులుగా నియమించారు. దాంతో శ్రీలంకలో దిసనాయకేతోపాటు మొత్తం నలుగురితో కూడిన క్యాబినెట్‌ కొలువుదీరింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన హరిణికి న్యాయ, విద్య, కార్మిక, పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక, ఆరోగ్యం, పెట్టుబడులు లాంటి కీలక శాఖలను కేటాయించారు. అధ్యక్ష ఎన్నికల అనంతరం అధికార మార్పిడిలో భాగంగా దినేష్ గుణవర్ధన తన ప్రధాని పదవికి నిన్న రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.

శ్రీలంకలో హక్కుల కార్యకర్తగా, యూనివర్సిటీ అధ్యాపకురాలిగా గుర్తింపు పొందిన హరిణి ఆ దేశ మూడో మహిళా ప్రధానిగా చరిత్ర లిఖించారు. ఎన్‌పీపీకి చెందిన ఎంపీలు విజిత హెరాత్, లక్ష్మణ్‌ నిపుణ రచిచి క్యాబినెట్‌ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. 

Social Share Spread Message

Latest News