బెంగళూరుకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ సాయిశ్వరి పాటిల్ ఎక్కువసేపు నిద్రపోవడం ద్వారా స్లీప్ చాంపియన్ గా నిలిచి రూ. 9 లక్షలు గెలుచుకున్నారు. బెంగళూరు స్టార్టప్ ఇనిషియేటివ్ వేక్‌ఫిట్ వరుసగా మూడో సీజన్‌లోనూ స్లీప్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం నిర్వహించింది. పోటీదారులు ప్రతి రాత్రి 8 నుంచి 9 గంటలు నిద్రపోవాల్సి ఉంటుంది. పోటీదారుల నిద్ర అలవాట్లను మెరుగుపరిచేందుకు, స్లీప్ చాంపియన్ టైటిల్ గెలుచుకునే అవకాశాన్ని చేజిక్కించుకునేందుకు స్లీప్ ఎక్స్‌పర్ట్స్‌తో వర్క్‌షాపులు కూడా వేక్‌ఫిట్ నిర్వహిస్తుంది.