Skip to main content

Namaste NRI

కాంతార చాప్టర్‌ 1 రిలీజ్‌.. ఎప్పుడంటే?

రిషబ్‌శెట్టి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కాంతార చాప్టర్‌ 1. కదంబుల కాలంలో సాగే కథాంశంతో ఈ సినిమా ఉండనుందని తెలుస్తున్నది. రిషబ్‌శెట్టి దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కింగరదూర్‌ నిర్మిస్తున్న ఈ భారీ పీరియాడిక్‌ డివోషనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుం టున్నది. దేశవాప్తంగా భారీ అంచనాలున్న ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని సినీ అభిమాను లంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది.

వచ్చే ఏడాది అక్టోబర్‌ 2న కాంతార చాప్టర్‌ 1ని విడుదల చేయనున్నట్టు మేకర్స్‌ ప్రకటించారు. జయరామ్‌ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్‌ కూడా నటిస్తారని గతంలో వార్తలొచ్చాయి. రిషబ్‌ ప్లాన్‌ చేస్తే కాంతార లో భాగం అవ్వడానికి తనకేం అభ్యంతరం లేదని తారక్‌ కూడా అన్నారు. మరేమవుతుందో చూడాలి.

Social Share Spread Message

Latest News