Skip to main content

Namaste NRI

భారతీయులకు బిగ్ షాక్ ఇచ్చిన కెనడా

భారతీయులకు జారీచేసే పర్యాటక వీసాల సంఖ్యను కెనడా భారీగా కుదించింది. గతంలో కెనడా పర్యాటక వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి 100 మంది భారతీయుల్లో దాదాపు 80 మందికి ఆ వీసాలు లభించేవి. కానీ, ఇప్పుడు ఆ సక్సెస్‌ రేటు 20% కంటే దిగువకు పడిపోయింది. ముఖ్యంగా పంజాబ్‌ నుంచి పర్యాటక వీసా ల కోసం వచ్చే దరఖాస్తులను కెనడా పెద్ద సంఖ్యలో తిరస్కరిస్తున్నది. గత కొన్ని నెలల నుంచి ఈ ధోరణి కనిపిస్తున్నది. అర్హత గల దరఖాస్తుదారులకు ఇచ్చే 10 ఏండ్ల ఆటోమ్యాటిక్‌ మల్టిపుల్‌-ఎంట్రీ టూరిస్ట్‌ వీసాల ను నిలిపివేయడానికి కొన్ని నెలల ముందు నుంచి కెనడా ఈ ధోరణిని అవలంబిస్తున్నది. తద్వారా పర్యాట కులకు తీవ్ర అడ్డంకులు సృష్టిస్తున్నది. కెనడా ఇమ్మిగ్రేషన్‌ విధానాలు గణనీయంగా కఠినతరం అవుతున్నట్టు ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

Social Share Spread Message

Latest News