Skip to main content

Namaste NRI

మిస్ యూనివర్శ్‌గా డెన్మార్క్‌ బ్యూటీ

మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో డెన్మార్క్‌కు చెందిన 21 ఏళ్ల విక్టోరియా కెజార హెల్విగ్‌ విజేతగా నిలిచింది. మెక్సికో వేదికగా జరిగిన మిస్‌ యూనివర్స్‌ 2024 పోటీల్లో 125 మంది పోటీ పడగా, విక్టోరియా విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకుంది. ఆదివారం జరిగిన మిస్‌ యూనివర్స్‌ 73వ ఎడిషన్‌ పోటీల్లో విజేతగా నిలిచిన విక్టోరియాకు 2023 మిస్‌ యూనివర్స్‌ షెన్నిస్‌ పలాసియోస్‌  విశ్వసుందరి కిరీటాన్ని అలంకరించింది.

ఈ మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో నైజీరియాకు చెందిన చిడిమ్మ అడెట్షినా మొదటి రన్నరప్‌గా నిలిచింది. మెక్సికో కు చెందిన మరియా ఫెర్నాండా బెల్‌ట్రాన్‌ రెండో రన్నరప్‌గా నిలిచింది. ఈ మిస్‌ యూనివర్స్‌ 2024 గ్రాండ్‌ ఫినాలేలో భారత్‌కు చెందిన రియా సింఘా కూడా పాల్గొంది. అయితే ఆమె టాప్‌ 30లోనే ఆగిపోయింది. ఈ సారి మిస్ యూనివర్స్ పోటీల్లో టాప్ 12లో ఏడుగురు లాటిన్ అమెరికా దేశాలకు చెందినవారే.

Social Share Spread Message

Latest News