Namaste NRI

 చైనా కంపెనీ బంపరాఫర్‌ .. డేటింగ్‌కు వెళ్తే

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒంటరి ఉద్యోగులు ఇటు వ్యక్తిగత జీవితాన్ని, అటు వృత్తిగత జీవితాన్ని సమన్వ యం చేసుకోలేక నానా తిప్పలు పడుతున్నారు. మరీ ముఖ్యంగా జీవితంలోని ఆనందాన్ని అనుభవించలేకపో తున్నారు. ప్రపంచం అంతటా ఈ సమస్య ఉన్నట్టే చైనాలో కూడా ఉంది. విజయమే లక్ష్యంగా పనిచేస్తున్న ఉద్యోగులు వ్యక్తిగత జీవితాన్ని విస్మరిస్తుండటంతో చైనా కంపెనీ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. ఒంటరి ఉద్యోగులు డేటింగ్‌కు వెళ్తే నగదు ప్రోత్సహకాలు అందిస్తామని ప్రకటించింది. షెంజెన్‌కు చెందిన ఇన్‌స్టా360 అనే టెక్‌ కంపెనీ ఈ బంపరాఫర్‌ ప్రకటించింది.

పార్ట్‌నర్‌ను పరిచయం చేస్తూ కంపెనీ డేటింగ్‌ ప్లాట్‌ఫాంపై పోస్టు పెడితే 66 యువాన్లు (దాదాపు రూ. 770) ఇస్తామని ప్రకటించింది. అంతేకాదు, ఆ బంధం విజయవంతంగా మూడు నెలలపాటు కొనసాగితే ఆ జంటతో పాటు వారిని కలిపిన వారికి 1,000 యువాన్లు (దాదాపు రూ.11,650) ఇస్తామని తెలిపింది. ఉద్యోగుల జీవితాల్లో సంతోషం నింపడంతోపాటు మనది అనే భావన పెంపొందించేందుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు కంపెనీ తెలిపింది. ఈ ప్రోత్సాహకం ప్రారంభించిన తర్వాతి నుంచి ఇప్పటి వరకు 500 పోస్టులు వచ్చినట్టు పేర్కొంది. ఇందుకు గాను 10 వేల యువాన్ల (దాదాపు రూ. 1.16 లక్షలు) ప్రోత్సాహకాలు అందించినట్టు వివరించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events