Namaste NRI

ఆ దేశంలోని భారతీయ విద్యార్థుల్లో కలవరం

తమ కీలకమైన పత్రాలను మరోసారి సమర్పించాలని అధికారులు ఆదేశించడంతో కెనడాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. తమ స్టడీ పర్మిట్లు, వీసాలు, మార్కులు, హాజరు సహా విద్యాపరమైన రికార్డులను సమర్పించాలని ఇమిగ్రేషన్‌, రిఫ్యూజీస్‌ అండ్‌ సిటిజెఎన్‌షిప్‌ కెనడా (ఐఆర్‌సీసీ) నుంచి అనేక మంది విద్యార్థులకు ఈ-మెయిల్స్‌ అందాయి. రెండేళ్ల గడువుతో వీసాలు ఉన్న చాలా మంది విద్యార్థులకు ఈ ఈ-మెయిల్స్‌ గుబులు రేపినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి.

అంతర్జాతీయ విద్యార్థుల రాకను క్రమబద్ధం చేసేందుకు ఎస్‌డిఎస్‌ పేరిట తన ఫాస్ట్‌ ట్రాక్‌ స్టడీ వీసా ప్రోగ్రామ్‌ను ఐఆర్‌సీసీ ముగించిన తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. పంజాబ్‌కు చెందిన విద్యార్థులకు కూడా ఈ తరహా ఈ-మెయిల్స్‌ అందాయి. తమ గుర్తింపును నిరూపించుకునేందుకు ఐఆర్‌సీసీ కార్యాలయాన్ని సందర్శించాలని కూడా వారికి ఆదేశాలు వెళ్లాయి. తాజా పరిణామాల పట్ల భారతీయ విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress