Skip to main content

Namaste NRI

గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ డేట్ వచ్చేసింది

తమిళ అగ్ర నటుడు అజిత్‌కుమార్‌ నటిస్తున్న భారీ పానిండియా సినిమా  గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ. తిష కృష్ణన్‌ కథానాయిక. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకుడు. మైత్రీ మూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నా రు. ఏప్రిల్‌ 10న ఈ సినిమా విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో తుపాకీ చేతబట్టి సోఫాలో కూర్చున్న అజిత్‌ సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇందు లోని అజిత్‌ పాత్రలో మల్టీ లేయర్లుంటాయని, దర్శకుడు అధిక్‌ రవిచంద్రన్‌ అద్భుతమైన కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రంలో ప్రభు, ప్రసన్న, అర్జున్‌ దాస్‌, సునీల్‌ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: అభినందన్‌ రామానుజం, సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్‌.

Social Share Spread Message

Latest News