ఉప్పెన లాంటి విజయం తర్వాత వైష్టవ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం కొండపాలం. రాయలసీమ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన కొండపొలం నవల ఆధారంగా దర్శకుడు క్రిష్ రూపొందించిన చిత్రం. రకుల్‌ప్రీత్‌సింగ్ కథానాయిక. సోమవారం చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. హైదరాబాద్‌లో ఉద్యోగవేటలో ఎన్నో అవమానాల్ని ఎదుర్కొన్న రవీంద్రయాదవ్ రాయలసీమలోని తన గ్రామానికి వెళ్లిపోతాడు. వర్షాభావ పరిస్థితుల్లో గ్రాసం కోసం గొర్రెల మందను నల్లమల అరణ్యంలోకి తోలుకుపోతాడు. అడవిలో రవీంద్రయాదవ్‌కు ఎదురైన పరిస్థితులు, క్రూర మృగాలతో పాటు అంతకంటే ప్రమాదకరమైన మనుషులతో చేసిన పోరాటం, ఓబులమ్మతో నడిపిన ప్రేమాయణం అడవి నేర్పిన జీవిత పాఠాల్ని ఆవిష్కరిస్తూ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్ వీఎస్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఆర్: రాజ్‌కుమార్ గిబ్సన్, నిర్మాణ సంస్థ : ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్మాత: సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి, దర్శకుడు: క్రిష్ జాగర్లమూడి. ఈ చిత్రం అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకురానుంది.














