Namaste NRI

డీప్‌సీక్ యాప్‌ సంచ‌ల‌నం…అమెరికా కంపెనీల‌కు ట్రంప్

డీప్‌సీక్ యాప్‌ అమెరికాలో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. చైనాకు చెందిన ఆ కొత్త త‌ర‌హా ఏఐ యాప్‌, వారం క్రిత‌మే మార్కెట్లోకి రిలీజైంది. కానీ ఆ యాప్ అమెరికా మార్కెట్‌తో పాటు ప్ర‌పంచ‌దేశాల్లో మార్కెట్ల‌ను షేక్ చేస్తున్న‌ది. డీప్‌సీక్ టెక్నాల‌జీ, అమెరికా టెక్నాల‌జీ పరిశ్ర‌మ‌కు మేల్కొల్పులాంటిద‌ని దేశాధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. లేజ‌ర్ ఫోక‌స్‌తో కాంపిటీష‌న్‌పై దృష్టి పెట్టి విజ‌యం సాధించాల‌ని ట్రంప్ పేర్కొన్నారు. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌కు చెందిన డీప్‌సీక్ యాప్ త‌న ప్ర‌త్య‌ర్థుల‌ను వెన‌క్కి నెట్టేసింది. చాట్‌జీపీటీని కూడా డీప్‌సీక్ యాప్ వెన‌క్కి నెట్టేసింది. అమెరికాలో అత్య‌ధిక సంఖ్య‌లో ఫ్రీగా డౌన్‌లోడ్ చేసిన యాప్‌గా డీప్‌సీక్ నిలిచింది. డీప్‌సీక్ టెక్నాల‌జీతో, అమెరికా ఏఐ ఇండ‌స్ట్రీ ఆందోళ‌న‌కు గుర‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి.

త‌క్కువ ఖ‌ర్చుతో త‌యారైన డీప్‌సీక్ ఏఐ యాప్‌తో, అమెరికా స్టాక్‌మార్కెట్‌లో ప్ర‌కంప‌న‌లు వ‌చ్చాయి. వాల్‌స్ట్రీట్ వ‌ణికిపోయింది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌లో మేటిగా భావించిన ఎన్విడియా కంపెనీ షేర్లు దారుణంగా ప‌డిపోయాయి. ఒక్క‌సారిగా ఆ కంపెనీ 500 బిలియ‌న్ల డాల‌ర్లు కోల్పోయింది. అనేక టెక్నాల‌జీ కంపెనీల షేర్లు కూడా  ట్రేడింగ్‌లో ప‌త‌నం అయ్యాయి. అయితే ఆ రోజునే త‌మ‌పై సైబ‌ర్ దాడి జ‌రిగిన‌ట్లు డీప్‌సీక్ కంపెనీ వెల్ల‌డించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events