Skip to main content

Namaste NRI

ఓ వాటర్ బాటిల్ అతడి జీవితాన్నే మార్చేసింది.. రాత్రికి రాత్రే

దుబాయ్‌లో నిర్వహించే మహజూబ్‌ మిలినీయర్‌ డ్రాలో తాజాగా హైదరాబాద్‌కు చెందిన మీర్‌ అనే వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 1 మిలియణ్‌ దిర్హమ్స్‌ (సుమారు రూ.2 కోట్లు) గెలుచుకున్నారు. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేవు. లాటరీ డ్రా నిర్వహించేందుకు ఐదు గంటల ముందు తాను కొనుగోలు చేసిన వాటర్‌ బాటిల్‌ తనకు ఈ అదృష్టాన్ని తెచ్చి పెట్టిందని తెలిపారు. ఇలా వాటర్‌ బాటిల్‌ కొనడం ద్వారా తాను మహజూజ్‌ లాటరీలో భాగమయ్యానని పేర్కొన్నాడు. వాటర్‌ బాటిల్‌ కొన్న సమయంలో తనకు ఒక లాటరీ టికెట్‌ ఇచ్చారని, దానిపై ఉన్న నెంబర్‌లోని ఆరు అంకెల్లో ఐదు అంకెలు మహజూబ్‌ డ్రాలో తీసిన స్క్రాచ్‌కార్డుపై ఉన్న సంఖ్యతో మ్యాచ్‌ కావడంతో తాను సెకండ్‌ ప్రైజ్‌గా 1 మిలియన్‌ దిర్హమ్స్‌ గెలుచుకున్నట్లు తెలిపారు.

                 12 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌ వెళ్లిన మీర్‌ అక్కడి ఓ సంస్థలో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. రెండు వారాల క్రితమే అతని భార్య కూడా ఇదే మహజూబ్‌ మిలియనీర్‌ డ్రాలో రూ.20 వేలు గెలుచుకుంది. ఇప్పుడు ఈ దంపతుల ఖాతాలో ఏకంగా మరో రూ.2 కోట్లు చేరబోతున్నాయి.

Social Share Spread Message

Latest News