Skip to main content

Namaste NRI

విదేశీ ప్రయాణికులకు ఆస్ట్రేలియా ఆహ్వానం

నవంబర్‌ నుంచి అంతర్జాతీయ ప్రయాణికులకు ఆస్ట్రేలియా స్వాగతం పలకనుంది. వ్యాక్సిన్‌ వేసుకున్న ప్రయాణికులను మాత్రమే అనుమతించనున్నది. 18 నెలల తర్వాత ఆస్ట్రేలియా తొలిసారి విదేశీ ప్రయాణికులకు ఆహ్వానం పలకనున్నది. ప్రస్తుతం ఆ దేశ పౌరులకు మాత్రమే ఆంక్షలతో ప్రయాణానికి అవకాశం కల్పిస్తున్నారు. విదేశాలకు వెళ్లేందుకు కూడా ఆస్ట్రేలియా తమ పౌరులకు అనుమతి ఇవ్వడం లేదు. వ్యాక్సినేషన్‌ 80 శాతం దాటిన రాష్ట్రాలకు ట్రావెల్‌ ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు ప్రధాని స్కాట్‌ మారిసన తెలిపారు. ఆస్ట్రేలియన్లకు మళ్లీ తమ జీవితాలను వెనక్కి ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

Social Share Spread Message

Latest News