Skip to main content

Namaste NRI

ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. భారతీయులకు ఊరట

కోవీషీల్డ్‌ టీకాకు ఆస్ట్రేలియా వైద్య నియంత్రణ మండలి ఆమోదం తెలిపింది. భారత్‌కు చెందిన సీరం సంస్థ కోవీషీల్డ్‌ కొవిడ్‌ టీకాలను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. కోవీషీల్డ్‌ టీకా తీసుకున్న భారతీయులు ఇక నుంచి ఆస్ట్రేలియాలో పర్యటించవచ్చు. ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వేలాది మంది ఇండియన్లకు ఊరటనిచ్చింది. కోవీషీల్డ్‌తో పాటు చైనాకు చెందిన సైనోవాక్‌ టీకాలు ఇస్తున్న రక్షణ పట్ల ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. సైనోవాక్‌, కోవీషీల్డ్‌ టీకాలు  వేసుకున్న అంతర్జాతీయ ప్రయాణికులకు ఆటంకాలు ఉండవని స్కాట్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News