Skip to main content

Namaste NRI

అమెరికా మరో తెలుగు విద్యార్థి మృతి

ఉన్నత చదువుల కోసం అగ్ర రాజ్యం అమెరికా వెళ్లి మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు. దుండగుడు జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.  రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రానికి చెందిన గంప రాఘవులు-రమాదేవి దంపతులకు కొడుకు ప్రవీణ్(27)‌, కుమార్తె ఉన్నారు. కుమారుడు ప్రవీణ్‌ కొంతకాలం కిందట ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ విస్కాన్సిన్‌ మిల్వాంకిలో నివాసం ఉంటున్నాడు. అక్కడే యూనివర్సిటీలో ఎంఎస్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఖర్చుల కోసం ఓ స్టార్‌ హోటల్‌లో పార్ట్‌టైం జాబ్‌ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ప్రవీణ్‌ నివాసం ఉండే ఇంటికి సమీపంలోని బీచ్‌ దగ్గర తాజాగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో గాయపడ్డ ప్రవీణ్‌ అక్కడికక్కడే మరణించారు.  ప్రవీణ్‌ మరణవార్తను అతని స్నేహితులు ఇండియాలోని కుటుంబసభ్యులకు తెలియజేశారు. దీంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రవీణ్‌ మృతితో కేశంపేట మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Social Share Spread Message

Latest News