ప్రముఖ కథానాయకుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, దానయ్య, నవీన్ ఎర్నేని, వంశీ రెడ్డి, సునీల్ నారంగ్ బన్నీ వాసులు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యల గురించి సృహృద్భావ వాతావరణంలో వీరి మధ్య చర్చలు జరిగాయి. ఆన్లైన్ టికెట్ల వ్యవహారంపై గత కొన్ని రోజులుగా రగడ జరుగుతున్నది. సినిమా వ్యవహారం కాస్త రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే. ఈ వివాదానికి తెర దించేందుకు సినీ నిర్మాతలు రంగంలోకి దిగారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ పేర్నినానిని కలిసి చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై నిర్మాతలు చర్చించారు. ఈ నేపథ్యంలో నిర్మాతలు పవన్ కల్యాణ్‌తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.














