మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొన్నారు నటుడు బండ్ల గణేశ్. ఆ మేరకు తన నామినేషన్‌ని ఉపసంహరించుకున్నారు. నా దైవసమానులు, నా ఆత్మీయులు, నా శ్రేయోభిలాసుల సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు. ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్‌తో కలిసి దిగిన ఫొటోని పంచుకున్నారు. బండ్ల మొదట ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌లోనే ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత విభేదాలతో బయటికొచ్చారు. స్వతంత్య్రంగా ప్రధాన కార్యదర్శి పదవి కోసం పోటీ చేశారు.














