Namaste NRI

దుబాయ్ లో ప్రపంచ వాణిజ్య ప్రదర్శన ప్రారంభం .. పారిశ్రామికవేత్తలకు ప్రధాని పిలుపు

దుబాయ్‌లో ప్రపంచ వాణిజ్య ప్రదర్శన ప్రారంభమైంది.  ఈ సందర్భంగా ఇండియా పెవిలియన్‌ వద్ద సమావేశమైన వారినుద్దేశించి వర్చువల్‌ విధానంలో మోదీ ప్రసంగించారు. స్వేచ్ఛాయుత దేశాల్లో ఒకటైన భారత్‌లో గరిష్ఠస్థాయి అభివృద్ధికి అవకాశాలు మెండుగా ఉంటాయని పారిశ్రామికవేత్తలకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. తమ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు రావాల్సిందిగా వారిని ఆహ్వానించారు. నైపుణ్యాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు, నూతన ఆవిష్కరణలకు భారత్‌ కేంద్రంగా ఉందని తెలిపారు. వాణిజ్య, పారిశ్రామిక, విద్యా రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events