Namaste NRI

ఇదే మా కథ ప్రీ రిలీజ్ వేడుక

సుమంత్‌ అశ్విన్‌, శ్రీకాంత్‌, భూమిక, తాన్య హోప్‌లు కలిసి నటించిన చిత్రం ఇదే మా కథ. గురు పవన్‌ దర్శకత్వంలో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్‌ పతాకంపై మహేష్‌ గొల్లా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌లో ముఖ్య అతిథులుగా ఎంఎస్‌ రాజు, బి గోపాల్‌తో పాటు శ్రీకాంత్‌, సుమంత్‌ అశ్విన్‌, చిత్ర బృందం పాల్గొంది. ఈ సందర్భంగా దర్శకుడు గురు పవన్‌ మాట్లాడుతూ  వంద శాతం మన లక్ష్యాన్ని చేరుకోవాలని ఈ కథను రాశాను. అందుకే ఈ  రైడిరగ్‌ జానర్‌ను ఎంచుకున్నారు. సినిమా నుంచి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకముంది అన్నారు  హీరో శ్రీకాంత్‌ మాట్లాడుతూ ఫీల్‌గుడ్‌ మూవీ ఇది. నలుగురి లక్ష్యాలు ఏంటి? వాటిని ఎలా చేరుకున్నారు? ఒకరినొకరు ఎలా సహాయం చేసుకున్నారనేదే కథ. ఈ సినిమా సక్సెస్‌ అయి సుమంత్‌కు మంచి పేరు వస్తుందన్నారు. శ్రీకాంత్‌, సుమంత్‌ అశ్విన్‌లకు మంచి పేరు తెచ్చిపెట్టే చిత్రమవ్వాలని సీనియర్‌ దర్శకుడు బి. గోపాల్‌ ఆకాంక్షించారు.

Social Share Spread Message

Latest News