Namaste NRI

మహాత్ముడికి ఘన నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

జాతిపిత మహాత్మా గాంధీ, దేశ రెండో ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ సహా పలువురు ప్రముఖులు..వారి సమాధుల వద్ద నివాళులర్పించారు. రాజ్‌ఘాట్‌, విజయ్‌ఘాట్‌ వద్ద రామ్‌నాథ్‌ కోవింద్‌, మోదీ, సోనియా గాంధీ పుష్పాంజలి ఘటించారు. బాపు జీవితం, ఆదర్శాలు దేశంలోని ప్రతి తరానికి మంచి మార్గంలో నడవడానికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ప్రధాని మోదీ కొనియాడారు. మహాత్మాగాంధీ, 152వ జయంతి, లాల్‌ బహదూర్‌ శాస్త్రి 117వ జయంతి ఉత్సవాల్లో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం ప్రకాశ్‌ బిర్లా, ఢల్లీి సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, లాల్‌ బహదూర్‌ శాస్త్రీ కుమారుడు అనిల్‌ శాస్త్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ, శాస్త్రి సేవలు గుర్తు చేసుకున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events