Skip to main content

Namaste NRI

అంతరిక్షంలో సినిమా షూటింగ్

స్సేస్‌కి సంబంధించిన సినిమాలు ఇప్పటికే వచ్చాయి. అయితే, సినిమానే రోదసీలో తీయాలని బయల్దేరారు రష్యాకు చెందిన ఓ సినిమా బృందం వారు. ప్రైవేట్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్‌ఎక్స్‌ అభివృద్ధి చేసిన సూయజ్‌ ఎంఎస్‌`19 వాహకనౌకలో ఇద్దరు వ్యోమగాములు, సినిమా డైరెక్టర్‌, నటి భూమికి 354 కిలోమీటర్ల ఎత్తునున్న అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఐఎస్‌ఎస్‌)కు ప్రయాణమయ్యారు. ది చాలెంజ్‌ సినిమా షూటింగ్‌ కోసం 12 రోజుల పాటు వీరంత అంతరిక్షంలో గడుపనున్నారు.  రోదసిలో తీస్తున్న మొట్టమొదటి సినిమా ఇదే.  సుమారు 40  నిమిషాలు ఉండే ఈ సన్నివేశాల్ని అంతరిక్షంలోనే తెరకెక్కించనున్నారు.  ఈ సినిమా చిత్రీకరణ పూర్తయితే అంతరిక్షంలో సినిమా తీసిన తొలి దేశంగా రష్యా నిలవనుంది. ది ఛాలెంజ్‌ బృందం ఈ నెల 17న తిరిగి భూమికి చేరుకోనుంది. గతంలో టాక్‌క్రూజ్‌ హీరోగా అంతరిక్షంలో ఓ సినిమాని చిత్రీకరణ చేయనున్నట్టు గతంలోనే ప్రకటన చేశారు. ఇప్పటివరకూ దానికి సంబంధించిన తాజా సమాచారం ఏదీ లేదు.

Social Share Spread Message

Latest News