Skip to main content

Namaste NRI

వీసాలను ఆపేయడం సరికాదు: అమెరికా కోర్టు

అమెరికా ప్రభుత్వం వీసాల జారీ ప్రక్రియను నిలిపివేయడాన్ని ఆ దేశానికి చెందిన న్యాయమూర్తి తప్పుబట్టారు. ప్రయాణాలపై ఆంక్షలు, వీసాల జారీ ప్రక్రియ వేర్వేరు అంశాలని ఫెడరల్‌ జడ్జి జేమ్స్‌ బోస్‌బర్గ్‌ పేర్కొన్నారు. నిబంధనల్లో పేర్కొన్న అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కరోనా వ్యాపిస్తుందనే కారణంలో వీసా ప్రక్రియను ఆపివేయడం చట్ట వ్యతిరేకమన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా నేపథ్యంలో భారత్‌ సహా చైనా, యూకే, ఇరాన్‌, బ్రెజిల్‌ తదితర అనేక దేశాల నుంచి వచ్చే వారిపై అమెరికా ఆంక్షలు విధించింది.

Social Share Spread Message

Latest News