Skip to main content

Namaste NRI

టెక్సస్ లో మళ్లీ ఆ చట్టం అమల్లోకి!

అమెరికాలోని టెక్సస్‌లో ఒక కొత్త చట్టం అమలు చేశారు.  టెక్సస్‌ రాష్ట్ర ప్రభుత్వం గర్భస్రావాలపై నిషేధాన్ని మళ్లీ అమల్లోకి తెచ్చింది. ఫెడరల్‌ అప్పీళ్ల కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదరాబాదరాగా అబార్షన్లపై నిషేధాన్ని విధించింది. గర్భస్రావం చేయించుకునేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు ఆస్పత్రులకు క్యూలు కట్టిన నేపథ్యంలో కోర్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. టెక్సస్‌లోని ఆబార్షన్‌ చట్టాన్ని సస్పెండ్‌ చేస్తూ అమెరికా జిల్లా జడ్డి రాబర్ట్‌ పిట్‌మాన్‌ ఉత్తర్వులు ఇవ్వడంతో టెక్సస్‌ లోని ఆసుత్రులకు తాకిడి పెరిగింది.

Social Share Spread Message

Latest News