మెగాస్టార్ చిరంజీవి ఆచార్య విడుదలకు ముహూర్తం కుదిరింది. మెగా ప్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ఆచార్య మూవీ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమాని వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల తేదీతో కూడిన కొత్త పోస్టర్ను అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్టర్లో చిరంజీవి ఉగ్రరూపంలో దర్శనమిచ్చారు. ఓ పదునైన ఆయుధంతో శత్రువులను వేటాడేందుకు వెళ్తున్నట్లుగా కనిపించారు. కొరాటల శివ తెరకెక్కిస్తున్న చిత్రమిది. చరంజీవి, రామ్చరణ్ కలిసి నటించారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో చిరుకు జోడిగా కాజల్, చరణ్ సరసన పూజా హెగ్డే కనిపిస్తుంది. మణిశర్మ స్వరాలందిస్తున్నారు.














