Skip to main content

Namaste NRI

నేడే మా ఎన్నికలు

మా (మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) ఎన్నికలు నేడు జరగనున్నాయి. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు ప్యానెల్స్‌ పరస్పర ఆరోపణలతో ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించారు. రెండేళ్లకొకసారి జరిగే ఈ మా ఎన్నికల్లో అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులు, ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌, జనరల్‌ సెక్రటరీ, ఇద్దరు జాయింట్‌ సెక్రటరీలతో పాటు ట్రెజరర్‌, 18 మంది ఈసీ సభ్యులతో కలిసి మొత్తం 26 మందిని ఎన్నుకుంటారు. నేడు ఉదయం 8 గంటల నుంచి 2 గంటల వరకు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో పోలింగ్‌ను నిర్వహించనున్నారు.  ప్రస్తుతం మా లో మొత్తం 925 మంది సభ్యులు ఉండగా, 883 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓట్ల లెక్కింపు సాయంత్రం నాలుగు గంటలకు మొదలవుతుంది. రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఫలితాలు వెలువడే అవకాశముంది.

                మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మా ఎన్నికల అధికారి వి.కృష్ణమోహన్‌ తెలిపారు. మా ఎన్నికల కోసం జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్ల్‌ 3 గదుల్లో 12  పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలను పురస్కరించుకొని జూబ్లీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Social Share Spread Message

Latest News