Skip to main content

Namaste NRI

భారత సంతతి బాలికకు రికార్డు

ఆరేళ్ల వయసున్న బాలిక తన అద్భుతమైన జ్ఞాపకశక్తితో రికార్డు సాధించింది. గణితంలోని పై విలువలో ఎకాఎకి 1,560 దశాంశ స్థానాలను చకచకా చెప్పేసింది. భారత సంతతికి చెందిన ఆరేండ్ల ఇషానీ షణ్ముగం  ఈ నెల 13న తమ ఇంట్లో కూర్చుని, సింగపూర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధుల ముందు పది నిమిషాల పాటు ఏకధాటిగా ఈ అంకెలను చెప్పింది. వాటిని పరిశీలించిన ప్రతినిధులు ఆమె పేరిట రికార్డు నమోదు చేశారు. రెండేళ్ల వయసులోనే ఇషానీ జ్ఞాపశక్తి సామర్థ్యాన్ని తాము గుర్తించామని తల్లి వెన్నెల మున్ను స్వామి తెలిపారు. ఇది వరకు సింగపూర్‌కు చెందిన ఓ వ్యక్తి పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది.

Social Share Spread Message

Latest News