బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ధురంధర్. ఆదిత్య ధర్ దర్శకత్వం. రణ్‌వీర్ సింగ్ ఇందులో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. రణ్‌వీర్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా ధురంధర్ ఫస్ట్ లుక్ పేరిటా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రం 2025 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్‌తో పాటు ప్రముఖ నటులు సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, మరియు అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జ్యోతి దేశ్‌పాండే (జియో స్టూడియోస్), అలాగే లోకేష్ ధర్ మరియు ఆదిత్య ధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.















