Namaste NRI

అమెరికా మాజీ విదేశాంగ మంత్రి కొలీన్ పావెల్ మృతి

అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి కొలీన్‌ పావెల్‌ మృతి చెందారు. కరోనా కారణంగా పరిస్థితి విషమించి ఆయన మరణించారు. విదేశాంగ శాఖను చేపట్టిన తొలి నల్లజాతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. పావెల్‌ తల్లిదండ్రులు ఆఫ్రికా ఖండం నుంచి అమెరికాకు వలస వచ్చారు. సైన్యంలో తన కెరీర్‌ ప్రారంభించిన పావెల్‌ ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ చివరికి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి కూడా ఆయ్యారు. 2003లో ఇరాక్‌పై అమెరికా జరిపిన రెండు యుద్ధాల్లోనూ కీలక పాత్ర పోషించారు. 2000లో జార్జ్‌ బుష్‌ అడ్మినిస్ట్రేషన్‌లో అమెరికా విదేశాంగ మంత్రిగా వ్యవహరించారు.  పావెల్‌ మృతి పట్ల దేశవ్యాప్తంగా విచారం వ్యక్తమవుతోంది. తండ్రి, తాత, భర్తగా ఓ అద్భుతమైన వ్యక్తిని తాము కోల్పోయామని పావెల్‌ కుటుంబ సభ్యులు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events