Namaste NRI

తమ బలమేంటో ఆ రెండు దేశాలకు తెలుసు

చైనా, రష్యాలకు అమెరికా హెచ్చరిక చేసింది. తమ బలమేంటో ఆ రెండు దేశాలకు సహా ప్రపంచం మొత్తానికి తెలుసని, తైవాన్‌పై చైనా దాడికి  దిగితే తాము తైవాన్‌ను రక్షిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టం చేశారు. తమ బలం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రపంచంలోనే తాము అత్యంత శక్తివంతమైన మిలిటరీ దేశమని అన్నారు. చైనా, తైవాన్‌ ఉద్రిక్తల నేపథ్యంలో తాజాగా ఓ ప్రకటనలో బైడెన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. తైవాన్‌ విషయంలో చైనా కొన్నాళ్లుగా అతివాద ధోరణి ప్రదర్శిస్తోందన్నారు. తైవాన్‌ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కొద్ది రోజుల క్రితం తైవాన్‌ గగనతలంలోకి 52 యుద్ధ విమానాలను చైనా పంపింది. కొద్ది రోజులుగా చైనా ఇదే తరహాలో కవ్వింపు చర్యలకు దిగుతోంది. కాగా, తైవాన్‌తో అమెరికాకు ఉన్న ఒప్పందాల్లో ఎలాంటి మార్పు లేదని, ఆ పాలసీలనే ఇకపై కూడా కొనసాగిస్తామని బైడెన్‌ స్పష్టం చేశారు. తైవాన్‌ను చైనా నుంచి కాపాడతామని చైనాకు పరోక్షంగా హెచ్చరిక  చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events