Namaste NRI

హారిస్ బర్గ్ లో హైవే పరిశుభ్రతను దత్తత తీసుకున్న తానా మిడ్ అట్లాంటిక్ టీమ్

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) సేవ కార్యక్రమాలు చేయడం లో ముందు ఉంటుంది, సామాజిక బాధ్యతలో భాగంగా హారిస్ బర్గ్ లోని సిల్వర్ స్ప్రింగ్ టౌన్ షిప్ రహదారిని శుబ్రం చేసే కార్యక్రమాన్ని సెప్టెంబర్ 6వ తేదీన విజయవంతంగా నిర్వహించారు.

తానా ప్రెసిడెంట్ నరేన్ కొడాలి నాయకత్వంలో , బోర్డ్ మెంబర్ రవి పొట్లూరి , తానా బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు, తానా మిడ్ అట్లాంటిక్ రీజినల్ ప్రతినిధి ఫణి కాంతేటి మరియు కమ్యూనిటీ నాయకులు సతీష్ తుమ్మల, సునీల్ కోగంటి, సతీష్ చుండ్రు కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

100 కి పైగా విద్యార్థులు తానా వాలంటీర్స్ సామాజిక బాధ్యతలో భాగంగా కలిసి హైవే క్లీనింగ్ చేపట్టారు.
తానా మిడ్ అట్లాంటిక్ టీమ్ లో రాజు గుండాల, వెంకట్ ముప్ప, శ్రీను కోట, శ్రీనివాస్ అబ్బూరి, నవీన్ తోకల, వేణు మక్కిన, కిషోర్ కోన్క, రాకేస్ పైడి కలసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు అందరికీ రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేశారు. పాల్గొన్న విద్యార్థులకు వెంకట్ సింగు, ఫణి కాంతేటి పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అందజేశారు. సామాజిక బాధ్యతలో భాగంగా తానా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని తానా బోర్డ్ మెంబర్ రవి పొట్లూరి తో పాటు పలువురు అభినందించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events