Skip to main content

Namaste NRI

ఆనంద్ దేవరకొండ పుష్పక విమానం వచ్చేస్తోంది

యంగ్‌ హీరో ఆనంద్‌ దేవరకొండ నటించిన కొత్త చిత్రం పుష్పక విమానం రిలీజ్‌కు సిద్ధమవుతోంది.  ఫస్ట్‌ లుక్‌ నుంచి ఇప్పటిదాకా పుష్పక విమానం, సినిమాకు పాజిటివ్‌ బుజ్‌ క్రియేట్‌ అయ్యింది. రిలీజ్‌ చేసిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్‌ దక్కింది. సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఈ నెల 30న పుష్పక విమానం ట్రైలర్‌ ను రిలీజ్‌ చేయబోతున్నారు. ఇటీవల విజయ్‌ దేవరకొండ ఈ సినిమా కోసం చేస్తున్న ప్రమోషన్‌తో అంచనాలు పెరిగాయి. పుష్పక విమానం చిత్రాన్ని నూతన దర్శకుడు దామోదర తెరకెక్కించారు. విజయ్‌ దేవరకొండ సమర్పిస్తున్నారు. గోవర్ధన్‌ రావు దేవరకొండ, విజయ్‌ మట్టపల్లి, ప్రదీప్‌ ఎర్రబెల్లి చిత్ర నిర్మాతలు. శాన్వీ మేఘన నాయికగా నటిస్తోంది.  నవంబర్‌ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ గ్లోబల్‌ సినిమాస్‌ సంస్థలు ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: హెస్టిన్‌ జోన్‌ జోసెఫ్‌, సంగీతం: రామ్‌ మిరియాల, సిద్దార్థ్‌ సదాశివుని, అమిత్‌ దాసాని.

Social Share Spread Message

Latest News