Skip to main content

Namaste NRI

మెగాస్టార్ భోళా శంకర్… ముహూర్తం ఫిక్స్

మెగాస్టార్‌ చిరంజీవి కొత్త చిత్రానికి ముహూర్తం కుదిరింది. ఆయన నటించే తాజా చిత్రం భోళాశంకర్‌ సినిమా నవంబర్‌ 11న ప్రారంభం కానుంది. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర్‌  నిర్మిస్తున్నారు. నవంబర్‌ 15 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుంది. అన్నాచెల్లెళ్ల అనుబంధం ప్రధానాంశంగా తెరకెక్కిస్తున్నారు. అన్నగా చిరంజీవి చెల్లిగా కీర్తి సురేష్‌ నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరనేది ఇంకా వెల్లడికాలేదు. మహతి స్వర సాగర్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. టైటిల్‌ పోస్టర్‌కు ఆయన అందించిన బ్యాక్‌ గ్రాండ్‌ స్కోర్‌ అందరినీ ఆకట్టుకుంది. టైటిల్‌ పోస్టర్‌కు ఆయన అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందరినీ ఆకట్టుకుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. భోళా శంకర్‌ సినిమా 2022లో విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News